తెలంగాణ

telangana

ETV Bharat / state

fraud in cotton weighing : పత్తి దళారుల ఘరానా మోసం.. కాళ్ల బేరానికి వచ్చిన వ్యాపారి! - తెలంగాణ వార్తలు

fraud in cotton weighing : ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దళారుల మోసాలు బయటపడుతున్నాయి. ఇంటి వద్దే కొంటామంటూ... రిమోట్ ఆపరేటింగ్‌తో కాంటాలో మోసం చేస్తున్నట్లు రైతులు గుర్తించారు. నిజం బయటపడడంతో వ్యాపారి కాళ్ల బేరానికి వచ్చాడని అన్నదాతలు అంటున్నారు.

fraud in cotton weighing, cotton merchants
పత్తి దళారుల ఘరానా మోసం

By

Published : Dec 18, 2021, 1:18 PM IST

fraud in cotton weighing : ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దళారుల ఘరానా మోసం బయటపడింది. గ్రామీణ ప్రాంతాల్లో రిమోట్ ఆపరేటింగ్‌తో పత్తి కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సిరికొండ మండలం సాత్‌మోరిలో పత్తి దళారుల దోపిడీ వ్యవహారం వెలుగుచూసింది. ఇంటి వద్దే పత్తిని కొనుగోలు చేస్తామంటూ క్వింటాల్‌ పత్తికి ఏకంగా 30 నుంచి 40 కిలోలు జారేస్తుండటాన్ని గుర్తించిన రైతులు నివ్వెరపోయారు. పత్తిని తూకం వేసే సమయంలో కాటాలను దళారులు రిమోట్‌తో ఆపరేట్ చేస్తున్న వ్యవహారాన్ని అన్నదాతలు గుర్తించారు.

తూకాల్లో మోసంపై వ్యాపారిని సాత్‌మోరి గ్రామస్థులు నిలదీశారు. బండారం బయటపడగా నిజం ఒప్పుకుని డబ్బులు చెల్లిస్తానంటూ జగిత్యాల వ్యాపారి కాళ్ల బేరానికి వచ్చాడని రైతులు చెప్పారు. ఇలా ఎన్ని గ్రామాల్లో ఎంతమంది రైతులను మోసం చేశాడో తేల్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వ్యాపారిపై కేసు నమోదు చేసి.. మోసపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:Dundigal Air Force Academy: 'భారత వాయుసేన అత్యంత శక్తివంతమైంది'

ABOUT THE AUTHOR

...view details