తెలంగాణ

telangana

By

Published : Jul 4, 2020, 10:28 PM IST

ETV Bharat / state

బస్సులో కరోనా బాధితుల ప్రయాణం... మిగతావాళ్లు ఎక్కడున్నారో పాపం!

సాధారణ వ్యక్తుల్లాగే బస్సులో ప్రయాణించారు. గమ్యం చేరుకున్నాక... అక్కడి ఆస్పత్రికి చేరుకున్నారు. తామకు కరోనా పాజిటివ్​ ఉందని ఐసోలేషన్​ వార్టుల్లో చేరారు. మరి... వారితో పాటు ప్రయాణించినోళ్ల సంగతి ఏంటో ఆలోచించలేదు. ఈ విషయం తెలిసి ఆ బస్సులో ప్రయాణించిన మిగితావాళ్లు ఎక్కడెక్కడున్నారో వెతికే పనిలో పడ్డారు అధికారులు.

corona positives journey in bus to adilabad and nirmal
corona positives journey in bus to adilabad and nirmal

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు నడిచే ఆర్టీసీ బస్సుల్లో కరోనా సోకిన వ్యక్తులు ప్రయాణం చేయడం కలకలం రేపుతోంది. ఈ నెల 3న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి బయలుదేరిన ఓ బస్సులో నిర్మల్​కి చెందిన ముగ్గురు తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తమకు కరోనా సోకినట్లు హైదరాబాద్​లో పరీక్షలు చేయుంచుకున్న నివేదికలు చూపి... ఐసోలేషన్ వార్డులో చేరారు.

ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియగా... ముందుగా ఆర్టీసీ అధికారులను అప్రమత్తం చేశారు. ఆదిలాబాద్​కు రాత్రి 10:30 చేరుకున్న ఆ బస్సును శానిటైజ్​ చేశారు. మిగతా ప్రయాణికులు స్వచ్ఛందంగా రిమ్స్ ఆస్పత్రికి వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆదిలాబాద్ వైద్యాధికారి సూచించారు. ఆ బస్సులో మొత్తం 23 మంది ప్రయాణం చేసినట్లుగా గుర్తించిన అధికారులు... వారిని వెతికే పనిలో పడ్డారు. ఈ విషయం ఇటు ఆదిలాబాద్, అటు నిర్మల్ జిల్లాల్లో కలకలం రేపుతోంది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details