ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఓ బాలింత మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అదనపు జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఈ నెల 13న ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం వల్ల హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఉట్నూర్‌లో కరోనా కలకలం.. బాలింతకు పాజిటివ్.. - ఉట్నూర్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో కరోనా మహమ్మారి రోజురోజుకు దడ పుట్టిస్తుంది. గత 15 రోజుల నుంచి 9 కేసులు పాజిటివ్ కేసులు నమోదు కావటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఓ బాలింతకు కరోనా పాజిటివ్ వచ్చింది.
![ఉట్నూర్‌లో కరోనా కలకలం.. బాలింతకు పాజిటివ్.. Corona Positive For a childless woman at Utnnur in Adilabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7632255-684-7632255-1592253262713.jpg)
బాలింత మహిళకు కరోనా పాజిటివ్
అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి... ఆమెకు కరోనా పాజిటివ్ ఉందని నిర్ధరించినట్లు వెల్లడించారు. వెంటనే వైద్య సిబ్బంది రోగి ఇంటి వద్దకు చేరుకొని సర్వే ప్రారంభించినట్లు వైద్యురాలు డాక్టర్ అనురాధ తెలిపారు.
Last Updated : Jun 16, 2020, 6:54 AM IST