ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని శాంతినగర్లో బుధవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనా బారినపడినట్లు జిల్లా వైద్యాధికారి మనోహర్ వెల్లడించారు. మండల కేంద్రంలో ఒకేసారి 5 కేసులు రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా
ఉట్నూరులోని శాంతినగర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారి మనోహర్ వెల్లడించారు.
ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా
బాధితులతో 34 మంది కలిసి ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. మండల కేంద్రంలోని అన్ని దుకాణాలను మూసి వేయించారు. మరోవైపు పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారన్న అనుమానంతో ఉట్నూర్ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు.