తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బ్రేక్... విద్యార్థులు రాక వెలవెలబోతున్న రైలుబడి - Adilabad train school news

అదో రైలు... విద్యార్థులు, ఉపాధ్యాయులే అందులో ప్రయాణికులు. ఆ చుక్‌చుక్‌ బండి ఉన్నచోటు నుంచి అసలు ముందుకు కదలదు. కరోనా మహమ్మారి వేసిన బ్రేక్‌తో అది ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తూ కొవిడ్‌ కారణంగా వెలవెలబోతున్న రైలుబడిపై ఓ ఈటీవీ భారత్ కథనం.

కరోనా బ్రేక్... విద్యార్థులు రాక వెలవెలబోతున్న రైలుబడి
కరోనా బ్రేక్... విద్యార్థులు రాక వెలవెలబోతున్న రైలుబడి

By

Published : Mar 21, 2021, 5:40 AM IST

కరోనా బ్రేక్... విద్యార్థులు రాక వెలవెలబోతున్న రైలుబడి

ఆ పాఠశాలలోకి అడుగుపెట్టగానే ఎర్రటి రంగుతో కనిపించేంది రైలిజింన్‌ కాదు. ఆ వెనుకే వరుసగా ఉన్నవి బోగీలు కాదు. రైలులాంటి బడి మాత్రమే. దానిపై రాసి ఉన్న సంఖ్య... ఆ పాఠశాల రిజిస్టర్‌ నంబరు. ఆదిలాబాద్‌లోని డైట్‌ కళాశాల సమీపంలోని ఎన్జీఓ పాఠశాలకు వెళ్తే ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. రూ. 40 వేలు ఖర్చుచేసి పిల్లల్ని ఆకర్షించడానికి ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నం... కరోనా కారణంగా విద్యార్థుల దరిచేరడం లేదు.

రైలుబండిగా...

ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం 160 మంది విద్యార్థులుంటే 11 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తరగతి గదులు ఒకదానిని ఆనుకుని వరుసగా ఉండడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌ ప్రత్యేక చొరవతో రైలు డబ్బాలుగా రంగు వేయించారు. ముందున్న తరగతి గదికి ఎర్రరంగు వేసి దానిపై పాఠశాల రిజిష్టర్‌ నంబర్‌ను అచ్చం ఇంజిన్‌లా తయారుచేసి రైలుబండిగా మార్చేశారు.

వెలవెల...

గతేడాది మార్చి తొలి వారంలో రైలుబడిగా మారిన పాఠశాలకు విద్యార్థులు ఆసక్తిగా వచ్చారు. ఆనందంతో గెంతులేశారు. వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వారం తిరక్కుండానే లాక్‌డౌన్‌ అమలు చేశారు. ఇటీవల పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ... కరోనా ఉద్ధృతితో విద్యార్థులు బడికి రావడంలేదు. ఉపాధ్యాయులు మాత్రం విధులు నిర్వర్తించి వెళ్తున్నారు.

ఇదీ చదవండి:'అభివృద్ధి చూసే పట్టభద్రులు తెరాసను ఆశీర్వదించారు'

ABOUT THE AUTHOR

...view details