ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యాధిగ్రస్థులు కోలుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 21 మందికి, నిర్మల్ జిల్లాలో 21 మందికి, కుమురంభీం జిల్లాలో ఏడుగురు వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. కాగా వీరందరు కోలుకొని ఒక్కొక్కరు డిశ్ఛార్జ్ అయ్యారు. .
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా తగ్గుముఖం! - ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా వైరస్ సోకిన వారందరూ డిశ్ఛార్జ్ అయ్యారు. మరోపక్క వ్యాపార, వాణిజ్యవర్గాల దుకాణాలు సరి, బేసి సంఖ్యతో తెరుచుకోవడం వల్ల మార్కెట్లో జనసంచారంతో రోడ్లు రద్దగీ మారాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా తగ్గుముఖం!
మరోపక్క వ్యాపార, వాణిజ్యవర్గాల దుకాణాలు సరి, బేసి సంఖ్యతో తెరుచుకోవడం వల్ల మార్కెట్లో జనసంచారం ఎప్పటిలా మారింది. మాస్కులు ధరించక, భౌతిక దూరం పాటించని.. దుకాణాల యజమానులకు అధికారులు జరిమానా విధిస్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లాలో పదిమంది వలస కార్మికులకు కరోనా సోకగా.. వారిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి:కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు