తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2020, 9:41 AM IST

ETV Bharat / state

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో కరోనా విజృంభణ

జిల్లాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరుగుతుండటంతో... అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

corona-cases-increased-in-adilabad-district
ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో కరోనా విజృంభణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాలో గత మూడు రోజుల్లో ఏకంగా 26 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇద్దరు మృత్యువాత పడ్డారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4 కేసులు వెలుగు చూడగా... బాధితుల సంఖ్య 64కు చేరింది.

మంచిర్యాల జిల్లాలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదు కావడం కాస్త ఊరట కలిగిస్తున్నా... బాధితుల సంఖ్య అధికంగా ఉండటం జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా కడెంలోని పోలీస్ స్టేషన్‌లో ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటు గ్రామంలోని మరో ఇద్దరికి కరోనా నిర్ధరణ అయింది.

కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరుతో ఎవరికి పాజిటివ్ వచ్చిందో తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చూడండి:టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక కోసం మల్లగుల్లాలు.. పీఠం ఎవరికి దక్కేనో..!

ABOUT THE AUTHOR

...view details