ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో వైరస్ తీవ్రత అధికంగా ఉండటం... దాని ప్రభావం ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలపై కనిపిస్తోంది. ఇటీవల మంచిర్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండురోజుల వ్యవధిలోనే 29 మంది కొవిడ్ బారినపడ్డారు. జిల్లాలో సగటున రోజుకు 15 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అవుతోంది. జిల్లాలో కరోనా పరిస్థితిపై డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా - తెలంగాణ వార్తలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం 315 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా