ఆదిలాబాద్లో పెరిగిపోతోన్న కరోనా కేసులు... ఏడుకి చేరిన మృతులు - carona cases in telanagana
ఆదిలాబాద్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 33 మందికి కరోనా కేసులు నమోదవగా... ఒకరు మృతి చెందారు. జిల్లాలో ప్రస్తుతం 354 మందికి కరోనా సోకగా.. మృతుల సంఖ్య ఏడుకి చేరింది.
corona cases in adilabad district
ఆదిలాబాద్ జిల్లాలో నానాటికీ కరోనా బాధితులు, మృతుల సంఖ్య మరింత పెరుగిపోతోంది. జిల్లాలో తాజాగా 33 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా... ఓ వృద్ధురాలు కొవిడ్ బారినపడి మృతి చెందారు. వృద్ధురాలి మృతితో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య ఏడుకి చేరింది. జిల్లాలో ప్రస్తుతం 354 మందికి కరోనా సోకగా.. 11 మంది రిమ్స్ ఆస్పత్రిలో, మరో ఇద్దరు హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారంతా ఇంటి వద్దే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.