అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో వేయించిన కరోనా చిత్రాలు పలువురిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఉట్నూర్ ఎస్సై సుబ్బారావు ఆధ్వర్యంలో రోడ్డుపై ఈ ప్రదర్శన చేశారు.
కరోనా నివారణపై అవగాహన చిత్రం - కరోనా నివారణ చర్యల్లో భాగంగా అవగాహన చిత్రం
ఉట్నూరు మండల కేంద్రం ఐబీ చౌరస్తా వద్ద ఎస్సై సుబ్బారావు కొవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా కరోనా చిత్రం వేయించారు. ఈ చిత్రం పలువురిని అబ్బురపరుస్తూ... కరోనా నివారణకు దోహదపడేలా ఉంది.
కరోనా నివారణపై అవగాహన చిత్రం
లాక్‌డౌన్‌ను పాటిద్దాం... కరోనాను తరిమికొడద్దాం అనే నినాదంతో ఉన్న చిత్రాన్ని చూపుతూ... కరోనాను నివారించేందుకు అందరూ కృషి చేయాలని ఉట్నూరు డీఎస్పీ ఉదయ్ రెడ్డి సూచించారు. ఎస్సై ఆలోచన బాగుందని ప్రశంసించారు. లాక్‌డౌన్ కాలంలో ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు.
ఇదీ చూడండి:కరోనాపై 85ఏళ్ల బామ్మ విజయం