శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా... కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ విష్టువారియర్ అన్నారు. జిల్లాలోని చందునాయక్ తండాలో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 19 మద్యం సీసాలు, రూ. 30 వేల విలువ చేసే అక్రమ కలప, రూ. 30వేల విలువ గల తంబాకు పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను తెలుసుకున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలే
ఆదిలాబాద్ జిల్లాలోని చందునాయక్ తండాలో ఎస్పీ విష్టు వారియర్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.
నిర్బంధ తనిఖీలు