రైతుల సమస్యలపై ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఆందోళన బాటపట్టారు. ఫసల్ బీమా యోజన కోసం ప్రీమియం కట్టి, రెండేళ్లుగా పరిహారం కోసం రైతులు ఎదురుచూస్తున్నారని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించకపోవడం వల్లనే పరిహారం అందడం లేదని అన్నారు.
రైతులు బీమా కట్టి రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు: సుజాత - adilabad district news
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల సమస్యలపై కాంగ్రెస్ నేతలు ఆందోళన బాటపట్టారు. రెండేళ్లుగా పంట బీమా పరిహారం అందకపోవడాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు.
బీమా పరిహారం కోసం కాంగ్రెస్ రాస్తారోకో
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ యాపల్‌గూడ సమీపంలోని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని ఆమె స్పష్టంచేశారు. రాస్తారోకోతో దారి పొడవున వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: వ్యాక్సిన్‌పై ఆందోళన వద్దు.. అవగాహన పెంచుకోండి: గవర్నర్