Congress Protest Against BRS Comments : రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధంతో రాజకీయ వేడి రగులుకుంది. విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వాఖ్యలను... బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారంటూ జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటలు... వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్ సరఫరా లేదంటూ పార్టీ శ్రేణులు ఎదురుదాడికి దిగాయి.
Free Current Controversy in Telangana : పీసీసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని విద్యుత్తు ఎస్ఈ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. సీఎం కేసీఆర్ ప్లెక్సీని... దహనం చేసేందుకు యత్నించారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోగా.... ఇరువర్గాల మధ్యతోపులాట చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. నాణ్యమైన విద్యుత్ 8 గంటలు ఇస్తే సరిపోతుందని రేవంత్ అన్నారే తప్ప... 24 గంటల ఉచిత విద్యుత్‌కి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ధర్నాలకు దిగుతోందని విమర్శించారు.
ఉచిత కరెంటును తీసుకువచ్చిందే కాంగ్రెస్ :నిజామాబాద్ జిల్లా సాలూరలో.... హస్తం పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. 24 గంటల కరెంట్ అంటూ బీఆర్ఎస్ సర్కారు ప్రజలు మోసం చేస్తోందని విమర్శించారు. రైతులకి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు తెలుసుకున్నందువల్లే బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత కరెంటును తీసుకువచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని... ప్రజల్లో తమ పార్టీకి పెరిగిన ఆదరణను బీఆర్ఎస్ భరించలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను మరిచిన బీఆర్ఎస్ సర్కార్... ప్రజలను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తోందన్నారు.