ఆదిలాబాద్‌లో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత సహా పలువులు జిల్లా కాంగ్రెస్ నేతలు.. ఇందిర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజామోదం పొందాయని గుర్తుచేసిన నేతలు.. కాంగ్రెస్ శ్రేణులు ఆమె అడుగు జాడల్లో నడవడమే.. నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.
ఆదిలాబాద్‌లో ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి - Congress leaders tribute to Indira Gandhi in Adilabad
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె అడుగుజాడల్లో నడవడమే నిజమైన నివాళి అని నేతలు అభిప్రాయపడ్డారు.
ఆదిలాబాద్‌లో ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి