ఆదిలాబాద్లో రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించింది. పార్టీ జిల్లా ఇంఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా ఆయా మండలాల నుంచి రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఛలో కలెక్టరేట్.. ఆదిలాబాద్లో కాంగ్రెస్ నేతల ధర్నా - latest news of congress leaders protest in adilabad
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించింది. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరనసలు చేపట్టారు.
ఛలో కలెక్టరేట్.. ఆదిలాబాద్లో కాంగ్రెస్ నేతల ధర్నా
ధర్నా అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు పొలాలకు చీడ పట్టి రైతులను తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేలా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలంటూ ఆర్డీవో రాజేశ్వర్కి వినతిపత్రం అందజేశారు.
TAGGED:
ఆదిలాబాద్లో కాంగ్రెస్ ధర్నా