కాంగ్రెస్ నేతలు జలదీక్షకు వెళ్లకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, జడ్పీటీసీ సభ్యురాలు, కాంగ్రెస్ నేతలను శనివారం ఉదయం పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఉదయమే కాంగ్రెస్ నేతల ఇళ్లలోకి పోలీసులు వెళ్లి ముందు జాగ్రత్తగా వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
జలదీక్షకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు - adilabad district news
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జలదీక్షకు వెళ్లకుండా ముందు జాగ్రత్తగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, కాంగ్రెస్ నేతలను పోలీస్ స్టేషన్కు తరలించారు.

జలదీక్షకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
ప్రజల కష్టాలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం బాధాకరమని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజల కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం ఆపాలని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ తప్పుడు ప్రచారం: ఉత్తమ్