తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన దండోరా సభ.. భారీగా తరలివచ్చిన జనం - telangana varthalu

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. గుస్సాడి సంప్రదాయ రీతిలో నేతలకు కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడం వల్ల గుడిహత్నూర్‌ నుంచి ఇంద్రవెల్లి మార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన దండోరా సభ.. భారీగా తరలివచ్చిన జనం
ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన దండోరా సభ.. భారీగా తరలివచ్చిన జనం

By

Published : Aug 9, 2021, 4:51 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌ సారథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కి, జీవన్​రెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్​బాబు, పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్​, తదితరులు హాజరయ్యారు. గుస్సాడి సంప్రదాయ రీతిలో నేతలకు కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.

సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడం వల్ల గుడిహత్నూర్‌ నుంచి ఇంద్రవెల్లి మార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేస్తున్నారు. సభాస్థలికి దూరంగా వాహనాలను పార్కింగ్‌ చేయిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కాలినడకన సభకు తరలివచ్చారు. సభాస్థలిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:rrr: 'ప్రవీణ్‌కుమార్‌ రాజకీయ దృక్పథం.. నా ఆలోచనా విధానం ఒకేలా..'

ABOUT THE AUTHOR

...view details