తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress and BJP Election Campaign Telangana 2023 : ప్రచారంలో విపక్షాల దూడుకు.. బరిలో దూసుకెళ్తున్న ట్రాన్స్​జెండర్​ - కాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ

Congress and BJP Election Campaign Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా విపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టికెట్‌ ఖరారైన కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఊరూరా విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్‌ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. నాయకుల పర్యటనలు, సమావేశాలు, సభలతో ఊరూవాడా ఎన్నికల సందడి నెలకొంది.

Congress and BJP
Congress and BJP Speed Up in Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 10:58 AM IST

Congress and BJP Speed Up in Election Campaign ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​.. బీజేపీ దూకుడు

Congress and BJP Election Campaign Telangana 2023 :రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలరోజులే గడువుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార బీఆర్​ఎస్​ను గద్దె దించటమే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీ(Congress Vs BJP)లు పోటీపోటీగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఖమ్మం సారథీనగర్‌లో అధికార పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ(Opponent Party Leaders Join Telangana Congress)లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన తుమ్మల.. మంత్రి పువ్వాడ అజయ్‌పై విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

"ప్రభుత్వ సొమ్మును మంత్రి పువ్వాడ అజయ్ తన సొంతానికి వాడుకోవడానికి నిదర్శనం సారధి బ్రిడ్జి నిర్మాణం. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. రేపు రాబోయే కాంగ్రెస్​ ప్రభుత్వంలో వీటన్నింటిని కూడా మీ కళ్లముందే సరిచేసి న్యాయం చేస్తాము." - తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి

Congress Election Campaign Telangana 2023 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి నియోజకవర్గ పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఈ నియోజకవర్గ టికెట్‌ ఆశించిన బడంగ్‌పేట్ మేయర్‌ పారిజాతనర్సింహారెడ్డి మినహాయిస్తే చల్లా నర్సింహారెడ్డి, దేపా భాస్కర్‌రెడ్డితో పాటు ఇతర నేతలు కేఎల్​ఆర్​తో సమావేశమయ్యారు. నారాయణ పేట జిల్లా మక్తల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వాకిటి శ్రీహరి.. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

Nagarjuna sagar Political War 2023 : సాగర్​లో.. వారసుల వార్​.. గెలుపు వరించేది ఎవరినో..?

Dharmapuri Arvind Campaign in Korutla : జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా వినూత్న కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ఎక్కడైతే అభివృద్ధి పనులు పూర్తికాలేదో.. అక్కడి నుంచి బీజేపీ కార్యకర్త స్వీయచిత్రం తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు(Dharmapuri Arvind Selfie Post) చేయాలని అర్వింద్ పిలుపునిచ్చారు. మెట్‌పల్లి మండలం కొండ్రికర్ల, చౌలమద్ది గ్రామాలలో వంతెన నిర్మిస్తానని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చినా.. ఇప్పటికీ పూర్తికాలేదంటూ అర్వింద్‌ సెల్ఫీ తీసుకుని పోస్టు చేశారు. మెట్‌పల్లి మండల జగ్గాసాగర్‌లో బీజేపీ బూత్‌ స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు.

Telangana BJP Election Campaign : నిర్మల్‌లో పార్టీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. లక్ష్మణచాంద మండలం చామన్‌పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి మహేశ్వర్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి.. నియోజకవర్గంలోని దత్తాపూర్, తొండకూర్, కోమట్‌పల్లి, నికల్‌పూర్‌ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ అభ్యర్థి హుస్సేన్‌నాయక్‌ నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లికుదురు మండలానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు హుస్సేన్‌నాయక్ సమక్షంలో బీజేపీలో చేరారు. జనగామ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి.. తరిగొప్పుల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి బీజేపీ అభ్యర్థి కడియం రాంచంద్రయ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

ఎన్నికల బరిలో ట్రాన్స్​ జెండర్​ : రాష్ట్రంలో తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ ఎన్నికల బరిలో దిగనుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చిత్రపు పుష్పత లయను బీఎస్పీ పోటీకి దించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన పుష్పతలయ.. డిగ్రీ పూర్తి చేసి, దిల్లీలోని కాల్ సెంటర్‌లో పనిచేశారు. రెండేళ్ల క్రితం ఆర్​ఎస్​ ప్రవీణ్ నేతృత్వంలో బీఎస్పీలో చేరిన ఆమె.. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆమె కృషిని గుర్తించిన పార్టీ.. వరంగల్ తూర్పు నుంచి అవకాశం కల్పించారు.

Opposition parties Telangana Election Campaign 2023 : బీఆర్​ఎస్​ని అధికారం నుంచి దించేందుకు.. ప్రతిపక్షాల వ్యూహాలు

Telangana Assembly Election Campaign 2023 : రాష్ట్రంలో ప్రచారాల జోరు.. నువ్వా-నేనా అంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details