ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో టీఆర్టీ ఎస్జీటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో గందరగోళం ఏర్పడింది. కౌంటర్లు తక్కువగా ఏర్పాటు చేయటం వల్ల ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు బారులు తీరారు. వర్షం కారణంగా బయట నిలబడలేక ఇరుకైన వరండాలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. శనివారం ఏజెన్సీ అభ్యర్థుల పరిశీలన జరుగనుంది. ఈ నెల 29న జడ్పీ సమావేశ మందిరంలో అభ్యర్థుల కౌన్సిలింగ్ ఉంటుందని డీఈఓ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎస్జీటీ ధ్రువపత్రాల పరిశీలనలో గందరగోళం - Verification of joint Adilabad district TRT SGT candidates' certificates
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్టీ ఎస్జీటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గందరగోళానికి దారి తీసింది. కౌంటర్లు తక్కువగా ఏర్పాటు చేయటం వల్ల అభ్యర్థులు నానా అవస్థలు పడ్డారు.
![ఎస్జీటీ ధ్రువపత్రాల పరిశీలనలో గందరగోళం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4865208-216-4865208-1571993481692.jpg)
ఎస్జీటీ ధ్రువపత్రాల పరిశీలనలో గందరగోళం