ఆదిలాబాద్‌లో కార్మిక సంఘాల ఆందోళన
కార్మికుల కనీసం వేతనం రూ. 18 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపిస్తూ... ఆదిలాబాద్‌లో వామపక్ష కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కార్మికుల కనీసం వేతనం రూ. 18 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూలతో కూడిన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కార్మికుల కనీసవేతనం రూ. 18వేలకు పెంచినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని.. అసంఘటిత కార్మికులకు పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : పెరిగిన పన్ను చెల్లింపులు... ఖజానా గలగలలు