జీవిత బీమా సంస్థ పెట్టుబడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎల్‌ఐసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
విధులు బహిష్కరించి.. ఎల్‌ఐసీ ఉద్యోగుల ఆందోళన - ఎల్‌ఐసీ సంస్థకు నష్టం
విదేశీ పెట్టుబడులను అనుమతించవద్దని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎల్‌ఐసీ ఉద్యోగులు ఒక రోజు సమ్మెకు దిగారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
విధులు బహిష్కరించి.. ఎల్‌ఐసీ ఉద్యోగుల ఆందోళన
నూతన ప్రతిపాదనల వల్ల.. ఎల్‌ఐసీ సంస్థ నష్టపోయే ప్రమాదముందంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం.. వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ప్రజలకిచ్చిన ప్రతిమాట నిలబెట్టుకునేలా బడ్జెట్ రూపకల్పన: హరీశ్‌రావు