ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ విద్యార్థి వేదిక ధర్నాకు దిగింది. అక్రమంగా నిర్భందించి జైల్లో ఉంచిన ప్రొఫెసర్, సాయిబాబా, ప్రొఫెసర్ వరవరరావులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. మేధావుల పట్ల పాలకులు అనుసరిస్తున్న తీరును తెవివే జిల్లా అధ్యక్షుడు రాహుల్ దుయ్యబట్టారు.
మేధావులను విడుదల చేయాలంటూ తెవివే ఆందోళన - varavarao
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యార్థి వేదిక ఆందోళనకు దిగింది. ప్రభుత్వం అక్రమంగా మేధావులపై కేసులు బనాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![మేధావులను విడుదల చేయాలంటూ తెవివే ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3267461-thumbnail-3x2-tvv.jpg)
మేధావులను విడుదల చేయాలంటూ తెవివే ఆందోళన