తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణంలో కలెక్టర్​ శ్రీదేవసేన పర్యటన - కరోనా వైరస్ వార్తలు

కరోనా కట్టడి చర్యలు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఆదిలాబాద్​ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ప్రజలు ఇంటి వద్దనే ఉండి... రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

collector sri devasena visit in adilabad town
పట్టణంలోని వార్డుల్లో కలెక్టర్​ శ్రీదేవసేన పర్యటన

By

Published : Apr 10, 2020, 12:49 AM IST

ఆదిలాబాద్​ పట్టణంలోని పలు వార్డుల్లో జిల్లా కలెక్టర్​ శ్రీదేవసేన పర్యటించారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారికి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ఉపయోగించాలని సూచించారు. ప్రజలు ఇంటిపట్టునే ఉండాలని పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్ పట్టణంలోని 19 కంటైన్మెంట్​ వార్డులను గుర్తించినట్టు కలెక్టర్​ శ్రీదేవసేన పేర్కొన్నారు. ఆయా వార్డుల ప్రజలు బయటకు రావొద్దని, ఇతర ప్రాంతాల ప్రజలు ఆయా వార్డుల వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి:గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..

ABOUT THE AUTHOR

...view details