ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన పర్యటించారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలి ప్రజలకూ సూచించారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి గ్రామంలోని దళిత బస్తీలో పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేశారు. తొలిసారిగా గ్రామానికి వచ్చిన కలెక్టర్‌ను గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జెడ్పీటీసీ సుధాకర్, ఎంపీపీ రత్నప్రభ, ఎమ్మార్వో స్వాతి, ఎంపిడిఓ శ్రీనివాస్, సర్పంచ్ భూమన్న తదితరులు పాల్గొన్నారు.
మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలి : కలెక్టర్ శ్రీ దేవసేన - ఆదిలాబాద్ న్యూస్
ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి తప్పకుండా కట్టుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలో కలెక్టర్ పర్యటించారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేశారు.

మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలి : కలెక్టర్ శ్రీ దేవసేన