ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ పల్లెబాట పట్టారు. తాంసి మండలం హస్నాపూర్‌లోని పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారా? లేదా? అని పరిశీలించారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి డిజిటల్ తరగతుల ప్రసారంపై ఆరా తీశారు. విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.
పల్లెబాట పట్టిన పాలనాధికారి... డిజిటల్ తరగతులపై ఆరా
ఆదిలాబాద్ జిల్లాలో ఆన్లైన్ తరగతుల నిర్వాహణ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పల్లె బాట పట్టారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి డిజిటల్ తరగతులపై స్పందన తెలుసుకున్నారు.
collector siktha patnayak visited tamsi mandal
తరగతులు శ్రద్ధగా వినాలని, అనుమానాలు ఉంటే ఉపాధ్యాయులను చరవాణి ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు డిజిటల్ తరగతులు వినేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రమైన తాంసిని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.