ఈటీవీ కథనానికి స్పందించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ పాపకు చికిత్స చేయించేందుకు ముందుకు వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం అకోలి గ్రామానికి చెందిన నైతం నరేష్, అనురాధ దంపతుల కూతురు రత్న బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. చికిత్స చేయించేందుకు డబ్బులు లేని ఆ కుటుంబం దయనీయ గాథపై శుక్రవారం ఈటీవీలో ప్రసారమైన కథనానికి జిల్లా పాలనాధికారి స్పందించారు. వైద్య బృందాన్ని బాధిత కుటుంబం ఇంటికి పంపించి వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రత్నకు అవసరమైన వైద్య చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
మానవత్వం చాటుకున్న కలెక్టర్ దివ్య దేవరాజన్ - మానవత్వం చాటుకున్న కలెక్టర్ దివ్య దేవరాజన్
బ్రెయిన్ ట్యామర్తో బాధపడుతున్న ఓ చిన్నారికి సాయం అందించాలంటూ ఈటీవీ కథనానికి స్పందన వచ్చింది. పాపకి వైద్య చికిత్సలందించేందుకు జిల్లా కలెక్టర్ ముందుకొచ్చారు.
మానవత్వం చాటుకున్న కలెక్టర్ దివ్య దేవరాజన్