'మహిళాభ్యుదయానికి ఇల్లే ప్రయోగశాల' - ఆదిలాబాద్ జిల్లా తాజా వార్త
మహిళలు అన్ని రంగాల్లో ధృడ నిశ్చయంతో ఎదగడానికి కుటుంబమే ఓ ప్రయోగశాలగా మారాల్సిన అవసరముందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రతినిధి శ్రీ దేవసేనతో మాణికేశ్వర్ ముఖాముఖి..
'మహిళాభ్యుదయానికి ఇల్లే ప్రయోగశాల'
మహిళాభ్యుదయానికి కుటుంబమే ప్రయోగశాలగా మారాల్సిన అవసరముందని ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు వచ్చిందని భావిస్తునప్పటికీ.. ఇంకా మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పదవులు అధిష్టించినా పెత్తనం మాత్రం పురుషులదే ఉంటోందని అన్నారు. చదువు, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసంతోనే మహిళలు స్వశక్తితో ముందడుగు వేయగలుగాతరని ఆమె పేర్కొన్నారు.