మన రాజ్యాంగం ఆదర్శవంతమైనదనీ, అందరికీ ఆమోదయోగ్యమైనదని.... ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిణి వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ దివ్యదేవరాజన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిణి, ఎస్పీ విష్ణు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన రాజ్యాంగ ప్రాధాన్యతను రాబోవు తరాలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
'మన రాజ్యాంగం ఆదర్శవంతమైనది' - ఆదిలాబాద్ జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
'మన రాజ్యాంగం ఆదర్శవంతమైనది'