ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముసురు పట్టుకుంది. ఖరీఫ్ ఆరంభం తరువాత ఏకధాటిగా ముసురు కురుస్తుండటంతో సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. వాగులు, చెరువులతో పాటు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన కుంటాల, పొచ్చర జలపాతలకు కొత్త నీరు వచ్చి చేరుతోంది.
ఆదిలాబాద్లో భారీ వర్షం... సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి - Coal production Stop at Singareni
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే ముసురు పట్టుకుంది. దీనివల్ల సింగరేణిలోని ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు.
ఆదిలాబాద్లో భారీ వర్షం... నిలిచిన బొగ్గు ఉత్పత్తి
సింగరేణిలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పత్తి, సోయా, జొన్న పంటలకు అనుకూలమైన వర్షం... కావడం వల్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరింత సమాచారం మాప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం