విద్యార్థి దశ నుంచే సంస్కారవంతమైన విద్య నేర్చుకుంటేనే సమాజానికి ఆదర్శంగా నిలుస్తామని ఐసీపీఎస్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి శారద తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పుట్లూరులోని 'ఎం ఫర్ సేవ' అనాథాశ్రమంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చదువులో రాణిస్తూనే... అన్ని రంగాల్లో ముందుండాలని చిన్నారులకు ఐసీపీఎస్ అధికారి శారద సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా... తన దృష్టికి తీసుకురావాలని పిల్లలకు తెలిపారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లి... దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన గుస్సాడి నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ఆకట్టుకున్న విద్యార్థుల గుస్సాడి నృత్యాలు... - CHILDREN DAY CELEBRATIONS IN PUTLURU
ఆదిలాబాద్ జిల్లా పుట్లూరులోని 'ఎం ఫర్ సేవ' అనాథాశ్రమంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు గుస్సాడి నృత్యాలతో అలరించారు.
CHILDREN DAY CELEBRATIONS IN PUTLURU