ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలలో వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విత్తనాలు ఎరువులకు సంబంధించిన రికార్డులను వ్యవసాయ శాఖ ఏవో రాఠోడ్ గణేశ్ పరిశీలించారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చే రైతులు విధిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.
ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు - Records examined Agriculture Department Ao Rathod Ganesh
విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు వచ్చే రైతులు విధిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని వ్యవసాయ శాఖ ఏవో రాఠోడ్ గణేశ్ తెలిపారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నియమాలను విధిగా పాటించాలని వ్యవసాయ శాఖ ఏవో రాఠోడ్ గణేశ్ వ్యాపారులకు సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలానికి ముందే రైతులు వ్యవసాయ వస్తువులు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?