Chakali Ilamma Birth Anniversary 2023 Across Telangana : వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ నాయకులందరూ నివాళులర్పిస్తున్నారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా జరుపుతున్నందున సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఆమె ధైర్య సాహసాలను గుర్తు చేసుకుని కేసీఆర్(CM KCR) నివాళులర్పించారు. ఆమె ధైర్య సాహసాలు నేటి తరానికి చైతన్యమని.. దీంతో పాటు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కేసీఆర్ కొనియాడారు. తన హక్కుల కోసం కోర్టుల్లో పోరాడిన ప్రజాస్వామికవాదని అన్నారు. ఆమె స్ఫూర్తి రాష్ట్ర సాధన, ప్రగతి ప్రస్థానంలో నిలిచిపోతుందని చెప్పారు. రజకుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. బీసీ, ఎంబీసీల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలతో సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు.
Harish Rao Pays Tribute Chakali Ilamma :బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న, బసవేశ్వరుడిని స్మరించుకున్నారు. కేసీఆర్ వచ్చాకే రజకులకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. లాండ్రీలకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత తమదేనని హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో 500 మంది రజకులకు లబ్ధి జరిగిందని తెలిపారు. కులవృత్తులకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానివి మాటలు.. మా ప్రభుత్వానివి చేతలని స్పష్టం చేశారు.
నేడు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి.. రాష్ట్రమంతా వేడుకలు..
MinistersPays tribute Chakali Ilamma : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో నాటి పోరాట యోధులకు సముచిత గౌరవం దక్కుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 128 జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చాకలి ఐలమ్మ(Chakali Ilamma) విగ్రహానికి మంత్రి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఐలమ్మ.. మహిళా చైతన్యానికి ప్రతీక అన్నారు. ఆమె జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. రజకులకు ధోబీఘాట్లే కాకుండా లాండ్రీ దుకాణాలు, నాయీబ్రహ్మణులకు క్షౌర శాలలకు ఉచిత కరెంట్ అందజేస్తున్నామని వివరించారు.