తెలంగాణ

telangana

ETV Bharat / state

Home Minister Amit Shah in Adilabad Sabha : ఆదిలాబాద్​లో అమిత్ షా ప్రచార భేరీ.. జనగర్జన సభతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం - బీజేపీ జన గర్జన సభ

Central Home Minister Amit Shah Adilabad Tour Today : ఆదిలాబాద్​లో జరిగిన జన గర్జన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కేసీఆర్ సర్కార్​పై విరుచుకుపడ్డారు. తెలంగాణను నెంబర్​వన్​ చేశానని చెబుతున్న కేసీఆర్.. ఏ రంగంలో నెంబర్​ వన్​గా మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిలో తెలంగాణ నెంబర్​వన్​గా మారిందని దుయ్యబట్టారు. ఆదిలాబాద్​లో జరిగిన ఈ సభలో అమిత్​ షాకు తరుణ్​ఛుగ్​, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్​, ఈటల రాజేందర్​ స్వాగతం పలికారు.

Central Home Minister Amit Shah
Central Home Minister Amit Shah Adilabad Tour Today

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 4:13 PM IST

Updated : Oct 10, 2023, 6:12 PM IST

Home Minister Amit Shah in Adilabad Sabha ఆదిలాబాద్​లో అమిత్ షా ప్రచార భేరీ.. జనగర్జన సభతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం

Central Home Minister Amit Shah Adilabad Tour : రాష్ట్రంలో ఎన్నికల(Telangana Assembly Election) సైరన్​ మోగడంతో.. పార్టీల ప్రచార హోరు మొదలైంది. ఈసారి ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్న భారతీయ జనతా పార్టీ.. ఆ దిశగా ప్రచారం ప్రారంభించింది. గతవారం మోదీ సభలో కార్యకర్తల్లో ఊపు తీసుకొచ్చిన హైకమాండ్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను తీసుకొచ్చింది. ఆదిలాబాద్​లో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభ(BJP Public Meeting)లో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా(Amit Shah) పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమిత్​ షాకు తరుణ్​ఛుగ్​, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్​, ఈటల రాజేందర్​ స్వాగతం పలికారు.

దిల్లీలో బయలుదేరి సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి ఆయన.. నేరుగా ఆదిలాబాద్​ చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన జనగర్జన సభలో అమిత్​ షా పాల్గొన్నారు. కేంద్రహోంమంత్రి సభ దృష్ట్యా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సాధారణ వాహనాలను దారి మళ్లించారు. ఎస్పీ ఉదయ్​కుమార్​ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షించారు.

Amit Shah: 'రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం'

BJP Public Meeing in Adilabad : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆదిలాబాద్​లో జరుగుతున్న సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలే లక్ష్యంగా విమర్శలు చేశారు. గిరిజనులను మోసం చేసిన కేసీఆర్​కు మూడోసారి అధికారం కట్టబెట్టవద్దని అమిత్ షా జిల్లా ప్రజలకు సూచించారు. అవినీతిలో తెలంగాణను నెంబర్​వన్​ను చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇక అవసరం లేదన్నారు. బీఆర్​ఎస్ పార్టీ గుర్తు కారు అయితే స్టీరింగ్ మాత్రం మజ్లిస్ చేతిలో ఉందని.. అలాంటి పార్టీ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకు వస్తుందని అమిత్ షా ప్రశ్నించారు.

బహిరంగసభ అనంతరం అమిత్ షా తిరిగి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. 5 గంటలకు హైదరాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి ఐటీసీ కాకతీయ హోటల్​కు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకొని.. అనంతరం సికింద్రాబాద్​ సిక్​ విలేజ్​లోని ఓ మందిరంలో నిర్వహించే మేధావుల సమావేశానికి హాజరై సూచనలు స్వీకరించనున్నారు.

సాయంత్రం 6.20 గంటల నుంచి 7.20 గంటల వరకు ఈ మేధావుల సమావేశం కేంద్రహోంమంత్రి అమిత్​ షా పాల్గొనున్నారు. అనంతరం వారు ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశం అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్​కు వెళ్లనున్నారు. రాత్రి 7.40 గంటల నుంచి రాత్రి 8.20 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఎన్నికల వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వానికి అమిత్​ షా దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. రాత్రి భోజనం చేసి.. అనంతరం 9.45 గంటలకు తిరిగి దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

Amit Shah Speech at Telangana Liberation Day 2023 : 'పటేల్‌ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదు'

Amit Shah Speech At Rythu Gosa BJP Bharosa Sabha In Khammam : 'కాంగ్రెస్‌ 4జీ.. బీఆర్​ఎస్​ 2జీ.. ఎంఐఎం 3జీ పార్టీలు'

Last Updated : Oct 10, 2023, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details