తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యాశాఖకే సున్నం వేశారు.. సేవ అంటూ నిట్టనిలువునా ముంచేశారు - Adilabad Crime News

Care Foundation fraud in Adilabad: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద సర్కారు బడులను బాగు చేస్తామని కేర్‌ ఫౌండేషన్‌ సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. వారి విజ్ఞప్తిని పరిశీలించిన ఉన్నతాధికారులూ సరే అన్నారు. అదే అదనుగా భావించిన సంస్థ బడుల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. ఆలస్యంగా తేరుకున్న ఆదిలాబాద్‌ విద్యాశాఖ అధికారులకు ఈ ఘటన చేదు అంశంగా మారింది.

Care Foundation
Care Foundation

By

Published : Mar 29, 2023, 8:01 PM IST

Updated : Mar 29, 2023, 8:45 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉద్యోగాల పేరిట కేర్‌ ఫౌండేషన్‌ నిర్వాకం

Care Foundation fraud in Adilabad: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యత కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తామని హైదరాబాద్‌కు చెందిన కేర్‌ ఫౌండేషన్‌ నమ్మించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, బోధన, న్యూట్రి గార్డెన్‌లు చేపడుతామని ఆ సంస్థకు చెందిన కొందరు ప్రతినిధులు జిల్లా పాలనాధికారికి లేఖను అందించారు. వారి మాటలు నమ్మిన అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న 130 పాఠశాలల జాబితాను ఇస్తూ సదరు సంస్థకు సహకారం అందించాలని ప్రధానొపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేశారు.

"స్కూల్​కు సంబంధించిన కిచిన్​ గార్డెన్​తో పాటు విద్యార్థులలో నైపుణ్యాలు వెలికి తీసి వారికి కంప్యూటర్​లో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్​ను కలిసి వారు అనుమతి కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం వచ్చింది. తీసుకున్న డబ్బులు వారికి తిరిగి చెల్లించాలని కోరుతున్నాం".- కంటె నర్సయ్య, విద్యాశాఖ అధికారి

ఇక్కడే అసలు తంతు మొదలైంది. డీఈవో కార్యాలయ ఉత్తర్వు కాపీని జతచేస్తూ పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని సదరు సంస్థ ప్రతినిధులు నిరుద్యోగులకు గాలం వేశారు. ఏకంగా అపాయింట్‌మెంట్ లెటర్లు ఇస్తూ నిరుద్యోగులను పాఠశాలలకు పంపడం ప్రారంభించారు. ఇప్పటికే విధుల్లో చేరిన అభ్యర్థులు తమకు పదేళ్ల పాటు సంస్థలో పనిచేయాలంటూ చెప్పి నియామకాలు పత్రాలు ఇచ్చారని చెబుతున్నారు.

"హైదరాబాద్​లో ఈసీఎల్​ఐ సెంటర్​లో 40 రోజులు మాకు ట్రైనింగ్​ ఇచ్చారు. ఆ తరువాత ఇక్కడ పోస్టింగ్​ ఇచ్చారు. 10 సంవత్సరాలు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాబ్​ చేసుకోవచ్చునని చెప్పారు. మొదట 13వేలు, ఆ తరువాత 18వేలు ఆ తరువాత 21 వేలు జీతం ఇస్తామని చెప్పారు".- కవిత, కేర్‌ సంస్థ నియమించిన ఉపాధ్యాయురాలు

Care Foundation fraud: 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి నెలకు తొలుత 13 వేలు ఇచ్చి తర్వాత పెంచుతామని నియామక పత్రంలో రాసి ఇచ్చారంటున్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే సమయంలో నియామకాలతో సంస్థ నిరుద్యోగులను బురిడీ కొట్టించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఘటన అద్దం పడుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

"నిన్న మా పాఠశాలకు కేర్​ ఫౌండేషన్​కు చెందిన వారమంటూ ఒక మహిళ వచ్చారు. కానీ అంతకు ముందు మా డీఈఓ ఆదేశాలు మేరకు సదరు మహిళను వెనక్కి పంపించడం జరిగింది".-భూపతి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు జడ్పీహెచ్‌ఎస్‌, ఆదిలాబాద్‌

ఇవీ చదవండి:

బీమా కథా చిత్రమ్.. డబ్బు కోసం తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపేశాడు

మీ మెడలో గోల్డ్ చైన్ ఉందా.. బస్సు ఎక్కితే మాత్రం కాస్త జాగ్రత్తండోయ్..

లొంగిపోయేందుకు అమృత్​పాల్ రెడీ.. ఆయనతో మీటింగ్ తర్వాతే పోలీసుల వద్దకు..

బంగారు ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Last Updated : Mar 29, 2023, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details