రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్లది. అలాంటి కుటుంబాన్ని క్యాన్సర్ భూతం కష్టాల సంద్రంలోకి నెట్టేసింది. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ గ్రామానికి చెందిన రుమ్మొల్ల గజ్జవ్వ- నర్సయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. నర్సయ్య స్థానికంగా ఓ ఆసుపత్రిలో సెక్యూరిటీగార్డుగా, భార్య బీడీలు చుడుతూ.. జీవనం సాగిస్తున్నారు.
కుటుంబాన్ని కష్టాల సంద్రంలోకి నెట్టేసిన క్యాన్సర్ - muthol cancer patient needs help
రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్లది. అలాంటి కుటుంబాన్ని క్యాన్సర్ భూతం కష్టాల సంద్రంలోకి నెట్టేసింది. ప్రస్తుతం ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.
కుమారుడు భూమేష్... సరస్వతీ శిశుమందిర్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. అతనికి క్యాన్సర్ సోకగా ఎలాగైనా కుమారుడిని రక్షించుకోవాలని రూ. 2 లక్షలు అప్పుచేసి 15రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చికిత్సకు రూ.6 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. దాతలు ముందుకు వచ్చి తన కుమారుడిని బతికించాలని వేడుకుంటున్నారు. నర్సయ్య పనిచేసే ఆసుపత్రి సిబ్బంది, వాట్సప్ గ్రూప్‌లలో పెట్టిన సమాచారంతో దాతలు ముందుకు వచ్చి రూ.3 లక్షల వరకు విరాళాలు అందించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ రూ.25 వేల చెక్కును అందజేసి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.