ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కేంద్రంలో సోమవారం వినాయక నిమజ్జన కార్యక్రమం నిరాడంబరంగా సాగింది. జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్ గణేశుడికి పూజలు నిర్వహించి.. ధ్వజారోహణ కార్యక్రమం, నిమజ్జనోత్సవ శోభాయాత్రను ప్రారంభించారు. మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.
' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'
కరోనా నియమాలు పాటిస్తూ వినాయక నిమజ్జనం జరుపుకోవడం హర్షణీయమని ఆదిలాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. సంప్రదాయాలను కాపాడుకుంటూ.. నిరాడంబరంగా వేడుకలు జరుపుకుందామని పేర్కొన్నారు.
'నిరాడంబరంగా నిమజ్జన కార్యక్రమం జరుపుకుందాం'
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, సామాజిక దూరం పాటిస్తూ వినాయకుని ఉత్సవాలు జరుపుకోవడం సంతోష దాయకమన్నారు. ప్రభుత్వం, అధికారులు సూచించిన విధంగా నియమాలు పాటిస్తూ వినాయక నిమజ్జనం పూర్తి చేసుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు