ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయం, రాజరాజేశ్వరాలయాల్లో భక్తులతో సందడి నెలకొంది. రాత్రంతా జాగారం చేసి శివారాధన, దీపారాధన చేశారు. అనంతరం తెల్లవారు నుంచి బోళా శంకురుడిని దర్శించుకుని దీక్ష విరమించారు. వీరి కోసం ఆలయాల ఆవరణలోనే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
శివస్మరణతో దీక్ష విరమణ - BOLA SHANKARA
మహాశివరాత్రికి పూజలు, ఉపవాసాలు ఉన్న భక్తులు ఉదయం దీక్ష విరమించారు. వేకువజామునే ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బోళా శంకురుడికి ప్రత్యేక పూజలు సమర్పించిన భక్తులు
ఇవీ చదవండి :శరణార్థులకు బాసటగా