ఆదిలాబాద్లో అక్షయ తృతీయ సందడి నెలకొంది. లాక్‌డౌన్ సడలింపు సమయంలో బంగారం దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడాయి. లాక్‌డౌన్ నిబంధనలో ఉండడంతో, ఆంక్షల మధ్య నగల దుకాణాలకు వెళ్లి, భౌతిక దూరం పాటిస్తూ బంగారం కొనుగోలు చేశారు. అక్షయ తృతీయ సందర్భంగా పసిడి ధర తులం రూ.50వేలు పలికింది.
లాక్‌డౌన్ సడలింపు సమయంలో బంగారం కొనుగోలు - బంగారం కొనుగోలు
అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం వల్ల మంచి జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. అందుకే ఈ రోజున ఎంతో.. కొంత బంగారం కొనేందుకు ప్రయత్నిస్తారు. గత సంవత్సరం కొవిడ్ ఆంక్షల మధ్యే అక్షయ తృతీయ జరుపుకున్నాము. ప్రస్తుతం కొవిడ్ రెండో దశ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆంక్షల మధ్య అక్షయ తృతీయ జరుపుకోవాల్సిన పరిస్థతి ఏర్పడింది.
లాక్‌డౌన్ సడలింపు సమయంలో బంగారం కొనుగోలు
అక్షయ తృతీయను మంచిరోజుగా భావించి... విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని రైతులు దుకాణాల బాట పట్టారు.
ఇదీ చూడండి:లాక్‌డౌన్ 2.0: రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు అమల్లోకి