ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం ఆరేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి బిహార్‌కు వలస కూలీలను తరలిస్తోన్న బస్సును వెనుకనుంచి లారీ ఢీ కొనగా.. ఆ బస్సు ముందున్న మరో బస్సును ఢీకొట్టింది.
వలస కూలీలతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం! - adilabad bus accident
ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం ఆరేపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.
accident
ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. వాహనాల్లో ఉన్న డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనాలను పక్కకు జరిపించారు. కూలీలను వేరే వాహనాల్లో తమ స్వస్థలాలకు పంపించారు.