ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యాంపూర్లోని దేవాలయంలో బుడుందేవ్ జాతర కోలాహలంగా కొనసాగుతోంది. నాగోబా జాతర తర్వాత మెస్రం వంశస్థులు... బుడుందేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బుడుందేవ్ ఆలయ ప్రాంగణంలో జాతర ప్రారంభమైంది.
కోలాహలంగా బుడుందేవ్ జాతర - బుడుందేవ్ జాతర
ఆదిలాబాద్ జిల్లా శ్యాంపూర్లోని బుడుందేవ్ జాతర వైభవంగా జరుగుతోంది. మెస్రం వంశస్థుల పూజల అనంతరం బుడుందేవ్ ఆలయ ప్రాంగణంలో జాతర మెుదలైంది. భారీగా భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కోలాహలంగా బుడుందేవ్ జాతర
ఆదివారం సెలవుదినం కావడం వల్ల ఉట్నూర్ మండలంతో పాటు పలు మండలాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: కేరళ వరద బాధితులకు ఈనాడు ఇళ్లు అందజేత.. సీఎం పినరయి హాజరు