పెట్రోల్‌బంక్ సమీపంలో పేలిన బాంబు.. వ్యక్తి మృతి - BOMB BLAST AT PETROL BUNK IN ADILABAD ON MAN DIED
15:29 December 30
పెట్రోల్‌బంక్ సమీపంలో పేలిన బాంబు.. వ్యక్తి మృతి
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు నాటుబాంబులు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నాటుబాంబు పేలింది. ప్రమాదంలో రాథోడ్ మాణిరావు(45)అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు ధాటికి మృతుడి శరీరభాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. శనిరావు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అడవిపందులను చంపేందుకు మహారాష్ట్రకు నాటుబాంబులు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు
TAGGED:
petrol bunk