తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో మెగా రక్తదాన శిబిరం - blood donation camp in adilabad

ఆదిలాబాద్​లో ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. రక్తహీనతతో బాధపడుతున్న వారి కోసం తాము ఎల్లవేళల అందుబాటులో ఉంటామని సొసైటీ సభ్యులు తెలిపారు.

blood donation camp in adilabad
ఆదిలాబాద్​లో మెగారక్తదాన శిబిరం

By

Published : Oct 11, 2020, 2:58 PM IST

ఆదిలాబాద్ పట్టణంలో ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగారక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లాలో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నందున అత్యవసర సమయంలో వారికి రక్తం కావాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య యువకులతో కలిసి రక్తదానం చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా సొసైటీ ఆధ్వర్యంలో యువకులంతా ఒకచోట చేరి ఆదివారం రక్తదానం చేసి తమ బాధ్యతను నిర్వర్తించారు. అత్యవసర సమయంలో రక్తం ఎవరికీ అవసరమైన తాము ముందుంటామని సభ్యులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఆస్తుల నమోదు శరవేగంగా జరగాలి: కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details