శనగల పంట మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఆదిలాబాద్‌లో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లిన భాజపా శ్రేణులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆదిలాబాద్‌లో భాజపా నాయకులు ఆందోళన
శనిగల పంట మద్దతు ధరకు కొనగోలు చేయాలని ఆదిలాబాద్‌లో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి అధికారులు బయటకు రావాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
కలెక్టరేట్ ముందు నినాదాలు చేస్తూ నిరసన
ఈ క్రమంలో కార్యాలయానికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. అధికారులు బయటకు రావాలంటూ... ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర.. రూ.5,100కు కొనుగోలు చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :140 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత