ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలకేంద్రంలోని ఐబీ చౌరస్తాలో భాజపా నాయకులు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా భాజపా నేతలను అరెస్ట్ చేయడం సమంజసం కాదని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు.
భాజపా నేతలపై అక్రమ అరెస్టులను నిరసిస్తూ ధర్నా - bjp leaders protest latest news
భాజపా నాయకులపై అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలకేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రశ్నించిన నాయకులను ప్రభుత్వం అరెస్ట్ చేయడమేంటని భాజపా నేతలు ప్రశ్నించారు.
భాజపా నేతలపై అక్రమ అరెస్టులను నిరసిస్తూ ధర్నా
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా.. వాటిని ప్రశ్నించినందుకు భాజపా నాయకులపై అక్రమ అరెస్టులు చేయడం విడ్డూరంగా ఉందని రమేష్ అన్నారు. అనంతరం గంగుల శ్రీనివాస్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఇదీ చదవండి:ఆ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు: బండి సంజయ్