ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. తెరాస నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాల నిధులను వాడుకుంటూ తమ పథకాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకురాలు సుహాసిని రెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు రసీదులను అందజేశారు.
కేసీఆర్పై విరుచుకుపడ్డ ఎంపీ బాపురావు - బీజేపీ
ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆదిలాబాద్ భాజపా ఎంపీ సోయం బాపురావు విరుచుకుపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు నిధులు లేని తెరాస ప్రభుత్వం.. గొప్పలు చెబుతోందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్పై విరుచుకుపడ్డ ఎంపీ బాపురావు