తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర చట్టాలను కాదనడం తెరాసకు పరిపాటిగా మారింది: ఎంపీ సోయం

ప్రధాని మోదీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు వెల్లడించారు. భాజపా ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా వ్యతిరేకించడం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారిందంటూ తెరాస సర్కారుపై విమర్శలు గుప్పించారు.

By

Published : Oct 5, 2020, 10:50 PM IST

bjp mp soyam bapurao criticised trs government on central on agri bills
కేంద్ర చట్టాలను కాదనడం తెరాస సర్కారుకు సరికాదు: ఎంపీ సోయం

భాజపా ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా.. వ్యతిరేకించడం తెరాస ప్రభుత్వ పరిపాటిగా పెట్టుకుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా భాజపా కార్యాలయంలో జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. మోదీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు జరిగే మేలు గురించి కేసీఆర్ ఆలోచించకపోవడం సరైన చర్యకాదని ఆరోపించారు. బిల్లులో ఏముందో తెలుసుకోకుండా.. అవగాహన లేకుండా రైతులను రెచ్చగొట్టేలా తెరాస, కాంగ్రెస్​లు వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

కేంద్రం తెచ్చిన చట్టాలపై కేవలం రాజకీయం తప్ప.. రైతుల ప్రయోజనం గురించి ఎవరూ ఆలోచించడం లేదన్నారు. చట్టంలో రైతులు తమకు నచ్చిన ధరకు పంట అమ్ముకునేలా వీలు కల్పించిందని.. మార్కెట్లో అమ్ముకుంటే చెల్లించాల్సిన పర్సెంటేజీల బాధ ఇకపై ఉందన్నారు. ప్రధాని తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:'కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details