ఆదిలాబాద్ మండల జడ్పీటీసి ఉప ఎన్నికలో.. భాజపాకు ఓటు వేసి గెలిపించాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. రానున్న ఎన్నికలో భాజాపా సత్తా ఏంటో చూపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.
'ఎమ్మెల్యేకు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచనైనా ఉందా..?' - ఆదిలాబాద్ జడ్పీటీసి ఉప ఎన్నిక
ఆదిలాబాద్ మండల జడ్పీటీసి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే ఎన్నికల వేడి రాజుకుంది. భాజపా మండల సమావేశంలో పార్టీ ఎంపీ సోయం బాపూరావు.. అధికార పార్టీపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఎంపీ సోయం బాపూరావు
మాయ మాటలతో తెరాస.. ప్రజలను మోసం చేస్తోందని సోయం మండిపడ్డారు. రాబోయే రోజుల్లో.. అధికార పార్టీ అవినీతిని బయటపెడతామని అన్నారు. ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఉందా.. అంటూ ఎమ్మెల్యే జోగు రామన్నను ఆయన ప్రశ్నించారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలోనూ.. సమావేశానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావడం విశేషం.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్‌లోకి పవన్‌కల్యాణ్