తమ మాట వినని జిల్లా కలెక్టర్‌ను జడ్పీ సమావేశంలో నిలదీస్తామన్న ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ తీరుపై ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఛైర్మన్‌గా ఉండి కలెక్టర్ స్థాయి అధికారిని బెదిరించే వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిజంగా ఛైర్మన్‌కు సత్తా ఉంటే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి జిల్లాకు ప్రత్యేక నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పనిచేసే కలెక్టర్‌పై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
జడ్పీ ఛైర్మన్ తీరుపై మండిపడ్డ భాజపా ఎంపీ
ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ తీరుపై భాజపా ఎంపీ బాపురావు మండిపడ్డారు. కలెక్టర్ స్థాయి అధికారిని బెదిరించి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
జడ్పీ ఛైర్మన్ తీరుపై మండిపడ్డ భాజపా ఎంపీ