తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశానికి మోదీ.. ఆదిలాబాద్​కు నేను' - ఎంపీ సోయం బాపురావు

దేశాంలో మోదీ చేస్తున్న అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుని... ఆదిలాబాద్​ జిల్లాను తాను అభివృద్ధి చేస్తానని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఇచ్చోడ మండలంలో నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'దేశానికి మోదీ.. ఆదిలాబాద్​కు నేను'

By

Published : Aug 22, 2019, 11:28 PM IST


దేశంలో సుస్థిరమైన, అవినీతి రహిత పాలన కేవలం భాజపాతోనే జరుగుతోందని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. ఇచ్చోడలోని సుభాష్​ నగర్​ కాలనీలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపురావు హాజరయ్యారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. రుణమాఫీని అమలు చేయలేదని ఆరోపించారు. దేశాన్ని మోదీ అభివృద్ధి పరుస్తున్నట్లుగా తాను జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. జిల్లాకు అతి త్వరలో రైలు మార్గం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.

'దేశానికి మోదీ.. ఆదిలాబాద్​కు నేను'

ABOUT THE AUTHOR

...view details