ఆదిలాబాద్ జిల్లా రైతుల వద్ద నుంచి కంది, శనగలు కొని చాలా రోజులు గడుస్తున్నా ఇంకా డబ్బులు చెల్లించకపోవడంపై భాజపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డబ్బులు చెల్లించాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో బకాయిలు చెల్లించాలని విన్నవించారు.
కలెక్టర్‌కి వినతి పత్రం అందజేసిన భాజపా నాయకులు - ADILABAD COLLECTOR SRI DEVASENA
రైతుల వద్ద నుంచి కంది, శనగలు కొని చాలా రోజులు గడుస్తున్నా ఇంకా డబ్బులు చెల్లించకపోవడంపై భాజపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ వస్తున్నందున త్వరగా అన్నదాతలకు డబ్బులు చెల్లించాలని కలెక్టర్ శ్రీ దేవసేనని కలిసి విన్నవించారు.
![కలెక్టర్‌కి వినతి పత్రం అందజేసిన భాజపా నాయకులు ADILABAD COLLECTOR SRI DEVASENA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7040750-910-7040750-1588493727897.jpg)
కలెక్టర్‌కి వినతి పత్రం అందజేసిన భాజపా నాయకులు
రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేనని కలిసిన వారిలో భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, నాయకులు వేణు గోపాల్, ఆదినాథ్ ఉన్నారు.
ఇవీ చూడండి:క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?